• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాజ్ పూర్‌లో సైన్స్ ఫెయిర్

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

February 28, 2026 / 06:04 PM IST

WOW.. సకల సౌకర్యాలతో హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్

RR: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద రూ.29.21 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు. 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. నూతన ముఖచిత్రం, విస్తృత వేచి ఉండే హాల్స్, మెరుగైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ DRM గోపాలకృష్ణన్ వెల్లడించారు.

February 28, 2026 / 06:04 PM IST

ఇంటర్ పరీక్షకు 5 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో సాధన జూనియర్ కాలేజీలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 5 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 138 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా జడ్జి

NRML: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన అభినందనీయమని సీనియర్ జడ్జి రాధిక అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించారు.

February 28, 2026 / 06:02 PM IST

‘100 రోజుల ఆరోగ్య మిషన్’

WNP: మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం హెల్త్ మిషన్ 100 పేరుతో బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 06:01 PM IST

ఉపాధి హామీ సామాజిక తనిఖీపై సభ

NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ ముగిసింది. గత నెల 24 నుంచి కొనసాగిన తనిఖీల్లో భాగంగా నేడు గ్రామ సభ నిర్వహించారు. అధికారులు పనులను పరిశీలించి ప్రజలకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మహేందర్, కార్యదర్శి సరిత, ఎఫ్ఏ, వార్డు సభ్యులు, కారోబార్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:01 PM IST

పాఠశాలలో నేషనల్ సైన్స్ డే

KMR: బీర్కుర్ మండలంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను, చిత్రపటాలను MEO వెంకన్న వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివకుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

February 28, 2026 / 06:01 PM IST

ఘనంగా ఏఈఓ పదవి విరమణ వీడ్కోలు

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సమావేశం శనివారం జరిగింది. టీఎన్జీఓస్ స్పెషల్ యూనిట్, మినిస్టీరియల్ 4వ తరగతి సిబ్బంది యూనియన్ సభ్యులు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొని ఆలయం తరఫున శ్రీనివాస్‌కు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 28, 2026 / 06:00 PM IST

‘ప్లాస్టిక్ రహిత పట్టణంగా జగిత్యాలను తీర్చిదిద్దాలి’

JGL: ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి అధ్యక్షతన ఫిబ్రవరి-2026 మాసం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రతిపాదనలు పంపాలని, సకాలంలో మున్సిపాలిటికీ పన్నులు చెల్లించాలని, చెత్తను తడి, పొడిగా చేసి కార్మికులకు అందించాలన్నారు.

February 28, 2026 / 06:00 PM IST

‘సమన్వయంతో పని చేస్తే సమస్యల పరిష్కారం’

MNCL: సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అద మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య సూచించారు. చంద్రయ్య స్థానిక సంస్థల విభాగానికి నూతన అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడంతో లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

February 28, 2026 / 06:00 PM IST

ఆకులతో పక్షుల బొమ్మల తయారీ

NZB: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని మోపాల్ మండలం సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రకృతిలో దొరికే సహజ ఆకులతో పక్షుల బొమ్మలు తయారు చేసి ప్రదర్శించారు. HM రాము మాట్లాడుతూ.. నో బ్యాగ్ డేతో విద్యార్థుల్లో కళా ప్రదర్శన విజ్ఞానం సృజనాత్మకత పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.

February 28, 2026 / 06:00 PM IST

‘కాంగ్రెస్ తోనే పేదలకు మంచి’

RR: నందిగామ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీని సర్పంచ్ కొమ్ము కృష్ణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంత ఇల్లు అనేది నిరుపేదలకు ఓ కలలాంటిదని, ఇందిరమ్మ ఇళ్లతో తమ కల నెరవేరిందని, కాంగ్రెస్ తోనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 05:51 PM IST

ఏటూరునాగారం APOకు వినతిపత్రం అందజేత

MLG: ఏటూరునాగారం ITDA కార్యాలయంలో APO వసంతారావుకు శనివారం TPTF జిల్లా నాయకులు ఉప్పస్వామి, పల్లె నాగరాజు వినతిపత్రం అందజేశారు. ఏటూరునాగారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఉన్నతికరించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్, కనీస వేతనం, పాఠశాలల అప్‌గ్రేడ్, 317 జీవో బాధ్యులకు న్యాయం చేయాలన్నారు.

February 28, 2026 / 05:50 PM IST

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్య మహిళా సాధికారత, వ్యవసాయం, మత్స్య రంగాలకు సంబంధించిన పనులకు శంఖుస్థాపనలు చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పాతగంగారం గ్రామంలో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

February 28, 2026 / 05:50 PM IST

‘సమాజం అభివృద్ధికి బాల్య వివాహాలు నిర్మూలించాల్సిందే’

RR: షాద్‌నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బాబు నాయక్ బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు.

February 28, 2026 / 05:49 PM IST