ADB: చెడు వ్యసనాలకు బానిస కాకుండా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన శబరిమాత రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
VKB: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిట్స్ ఉపయోగ పడతాయని సర్పంచ్ డీవై నర్సింహులు, ఉప సర్పంచ్ ప్రసాద్ అన్నారు. శనివారం పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ డేను నిర్వహించారు. విభిన్న అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శంకర్, తదితరులు ఉన్నారు.
RR: మసీదు బండలోని కుడికుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సాహె స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ కల్పన రమేష్ ఆధ్వర్యంలో, ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ ఆర్థిక సహకారంతో ఈ పునరుద్ధరణ పనులు చేపట్టారు. MLA గాంధీ సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్తో కలిసి ఈ రోజు చెరువును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు నాయకులు పాల్గొన్నారు.
KNR: ఇల్లందకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీణ ప్రణతి, సీనియర్ సివిల్ జడ్జి పిబి. కిరణ్ కుమార్ విద్యార్థులకు ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎస్సై క్రాంతికుమార్ చట్టపరమైన అంశాలు వివరించారు. తహసీల్దార్ భాస్కర్, సర్పంచ్ పాల్గొన్నారు.
ADB: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే హక్కులను సాధించుకోవాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేని అని పేర్కొన్నారు. నాయకులు రాందాస్, ప్రసన్నకుమార్, నరసింహులు తదితరులున్నారు.
KMR: నాగిరెడ్డి పెట్ మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో కల్యాణలక్ష్మి పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రామావత్ బాల్యనాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రామావత్ వాసురం ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రామావత్ కవితకు మంజూరైన చెక్కును అందజేశారు.
SRCL: వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్లతో పాటు కౌన్సిలర్లు కొండ శేఖర్, అన్నారం శ్రీనివాస్లను ఆదివారం ఘనంగా సన్మానించారు. శాలివాహన, మోచి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వారిని శాలువాలతో సత్కరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
SRPT: భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. కళ్యాణానికి ప్రత్యేకంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్‌లోని 9959226302 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
NRML: దేశ సేవలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలానికి చెందిన భాస్కర్ యాదవ్ ఇండియన్ ఆర్మీలో దిగ్విజయంగా 24 సంవత్సరాలు దేశ రక్షణ, సేవలు తన ఉద్యోగ పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటిసారిగా కాలనీకి విచ్చేస్తున్న సందర్భంగా కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతీయ జెండాలతో స్వాగతం ఘనంగా సన్మానించారు.
SDPT: జగదేవ్పూర్ మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్య పెద్ద రాయి పై కాల భైరవ స్వామి రూపం ఒకటి కనబడింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. పూర్వ కాలం నుంచి ఇక్కడున్న పెద్ద పెద్ద గుండ్లను బయన్న గుండ్లుగా పిలిచారని అన్నారు.పెద్ద రాయి పై చెక్క బడిన ఈ కాలభైరవుని రూపం బృహత్ శిలా యుగ కాలానికి ( క్రీ.పూ. 1000 సం.ల క్రితానికి) చెందినది అని తెలిపారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఏర్పాటు చేయించారు. వార్డులో విద్యుత్ సమస్య లేకుండా ఉండేందుకు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించినట్లు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి.అరిఫ్ తెలిపారు.
MBNR: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివప్రసాద్, చెన్నయ్య, అధ్యక్షులుగా కృష్ణయ్య, రాములు, ప్రధాన కార్యదర్శిగా ముకుంద రెడ్డి, రాజేష్, అయ్యప్ప, కోశాధికారిగా హరిప్రసాద్‌తో పాటు సంయుక్త కార్యదర్శి సలహాదారులుగా పలువురిని ఎన్నుకున్నారు.
GDWL: గద్వాల పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ పంప్ పక్కన రహదారి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్రమైన దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా రోడ్డుపైనే చెత్త పారేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ఆ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
BDK: భద్రాచలం నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలు అయిన, మున్సిపల్ ఎన్నికలు అయిన వార్ వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఇది జీర్ణించుకోలేని గత పాలకులు విషాన్ని చిమ్ముతున్నారన్నారు.