• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పందుల దొంగతనం కేసులో ఆరుగురు అరెస్ట్: సీఐ

WGL: సంగెం మండల కేంద్రంలో ఆస్తి తగాదాల కారణంగా దొంగిలించిన పందుల కేసును ఛేదించారు. గురువారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ. లక్షల విలువైన 25 పందులను స్వాధీనం చేసుకున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. రాయపురం రాజు తన బాబాయి కొమురయ్యపై పగతో, బంధువులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

March 5, 2026 / 04:19 PM IST

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు ఎమ్మెల్యే

MHBD: రాజ్యసభ సభ్యునిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీనాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నరేందర్ రెడ్డిని అభినందించారు.

March 5, 2026 / 04:17 PM IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలి: కలెక్టర్

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెలుసుకుని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలని సూచించారు.

March 5, 2026 / 04:08 PM IST

‘RK-న్యూటెక్ గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

MNCL: శ్రీరాంపూర్ ఏరియా RK-న్యూటెక్ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో గనిలోని కార్మికుల సంతకాల సేకరణ చేపట్టారు. గురువారం గని మేనేజర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కోల్ కట్టర్స్, సపోర్ట్ మేన్‌లకు నాణ్యమైన బిట్లు ఇవ్వాలన్నారు. షార్ట్ ఫైరర్‌కు రెగ్యులేషన్ ప్రకారం కేబుల్ అందించాలన్నారు.

March 5, 2026 / 04:03 PM IST

‘ఇరాన్ పై అమెరికా దాడిని ఖండించండి’

KMM: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో వివిధ దేశాలపై దాడులు కొనసాగించడం తప్పుడు చర్య అని CPM జిల్లా నాయకులు నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా గురువారం ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వందలాది మంది ప్రజలను హత్య చేయడం వంటి దుర్మార్గపు చర్యలను ఆపాలని పేర్కొన్నారు.

March 5, 2026 / 04:02 PM IST

‘జిల్లాలో ఇంటర్ పరీక్షకు 96% హాజరు’

పెద్దపల్లి జిల్లాలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4306 మంది హాజరు కావలసి ఉండగా, 4176 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 130 మంది గైర్హాజరు కావడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

March 5, 2026 / 04:01 PM IST

మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రణాళిక పై సమీక్ష

NLG: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యాచరణపై చిట్యాల మున్సిపల్ ఆఫీస్‌లో ఛైర్ పర్సన్ పందిరి గీత అధ్యక్షతన గురువారం సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30లకు 12వ వార్డులో ప్రారంభమవుతుందని కమిషనర్ శ్రీను తెలిపారు.

March 5, 2026 / 04:00 PM IST

ఇందిరమ్మ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం

KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికే ఆదర్శమని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాములు ఉన్నారు.

March 5, 2026 / 04:00 PM IST

SRR ప్రభుత్వ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్

KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో పనిచేయుటకు క్యాంపస్ డ్రైవ్ TSKC సహకారంతో నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌లో విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించగా 18 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

March 5, 2026 / 03:54 PM IST

‘కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి’

SRCL: ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రజాప్రతి నిధులదే అన్నారు.

March 5, 2026 / 03:51 PM IST

నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

RR: ఫరూఖ్ మండలం చించోడు రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువులను సరైన మోతాదులో పంటలకు పిచికారి చేయడం ద్వారా పంటల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.

March 5, 2026 / 03:49 PM IST

చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్

MDK: చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

March 5, 2026 / 03:45 PM IST

99 రోజుల ప్రగతి ప్రణాళికపై తహసీల్దార్ సమీక్ష

MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో గ్రామ, మండల స్థాయి సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్రత్యేక ప్రణాళికలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.

March 5, 2026 / 03:41 PM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

MBNR: నవాబ్ పేట మండలం లోకిరేవుకు చెందిన సుజాతకు 108 అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవమైంది. గురువారం ఉదయం నవాబ్ పేట ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ లక్ష్మణ్, పైలెట్ మహమూద్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.

March 5, 2026 / 03:40 PM IST

PVYS ఆధ్వర్యంలో పాలీసెట్ మోడల్ టెస్ట్ పోస్టర్ల విడుదల

MNCL: PVYS తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన పాలీసెట్-2026 మోడల్ టెస్ట్ పోస్టర్లను మంచిర్యాల DEO యాదయ్య గురువారం విడుదల చేశారు. పటేల్ విద్యార్థి యువజన సంఘం నిర్వహిస్తున్న ఈ మాదిరి పరీక్షలు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 5, 2026 / 03:38 PM IST