MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు అడవుల్లో శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి జాతర ఈ నెల 4 నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. పచ్చని అడవుల మధ్య వెలసిన ఈ వనదేవత ఆలయం గిరిజన సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ADB: నార్నూర్ మండలంలోని 23, గాదిగూడలోని 25 గ్రామపంచాయతీల సర్పంచులకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఎంపీడీఓలు పుల్లారావు, శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఉట్నూరులోని KB కాంప్లెక్స్ లో ఉన్న గల యూత్ ట్రైనింగ్ సెంటరు(YTC)లో ఉన్నత అధికారులు వారికి పరిపాలన, పథకాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు.
SRCL: బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఉపసర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు చిర్ర వంశీకృష్ణ, మంద వెంకటేష్ గౌడ్, ఎం. డి యూసఫ్ బాబు, కందుల పుష్పలత, బచ్చు రమ, ముచ్చ సుమలత, జంగం వినోద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పనుల్లో పాల్గొంటున్న వారికి మజ్జిగ పంపిణీ చేశారు.
KMR: అచ్చంపేట TGMS పాఠశాల విద్యార్థినులు దీక్షిత, ప్రణతి ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రోబోటిక్స్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రతిభ కనబరిచి ట్రోఫీ సాధించారు. తమ రోబోటిక్స్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందారు. ఈ విజయంతో పాఠశాలకు, మండలానికి గర్వకారణమయ్యారు. ఉపాధ్యాయురాలు చందనను, విద్యార్థినులను తల్లిదండ్రులు అభినందించారు
ASF: మట్కా ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ SI సుధాకర్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో కొందరు వ్యక్తులు మట్కా ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.10,400 నగదు, మట్కా చీటిలు, సెల్ఫోన్లు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు SI పేర్కొన్నారు.
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు కోరారు.
BHNG: రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన తులసి అశోక్ గౌడ్ ఇటీవల తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందడు. దీంతో అతని కుటుంబానికి 2001- 2002 సంవత్సర పదవ తరగతి స్నేహితులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు.
SRPT: మోతె మండల కేంద్రంలోని తిరుపతమ్మగోపయ్య స్వామి ఆలయంలో సోమవారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందని చెప్పారు. మంగళవారం అమ్మవారికి బోనాలు, ప్రభబండ్లతో ఊరేగింపు, జాతర జరుగుతుందని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
WGL: మిల్స్ కాలనీ PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. CI రమేష్ వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నాగ్ భరత్ కుటుంబం అమ్మవారిపేటలోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే ఆయన కుమార్తె రూపాలి(15) రెండు రోజులుగా ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతోంది. కొంచం సమయం ఇవ్వాలని తల్లిదండ్రులు అడగగా మనస్తాపం చెంది ఉరివేసుకొని మృతి చెందింది.
BHPL: జిల్లాలోని గ్రామాల్లో అక్రమ గుడుంబా వ్యాపారం బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది. దేవాలయాలు, పాఠశాలల సమీపంలోనే మద్యం అమ్మకాలు జరుగుతుండటం, తండాల నుంచి బైక్‌ల ద్వారా రోజువారీ సరఫరా జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గుడుంబా మాఫియాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాధ్యులను చట్టా రీత్యాలు శిక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
KMR: దోమకొండ మండల కేంద్రం నుంసీ ముత్యంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు కోసం కంకర వేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
SDPT: పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో నేడు కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నట్లు గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. భద్రాచల రామయ్య కళ్యాణానికి గోటితో వడ్లు ఓలిచి అందించే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
SRD: జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దమ్మగూడెం చెందిన బంగారి రాజు (24) వ్యవసాయ పొలం వద్ద ఉన్న మత్తడిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. తండ్రి ముత్యాలు, స్థానికులు వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
GDWL: జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VKB: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ నిర్వహించనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సాయంత్రం 4:20 వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు వీరికి స్వాగతం పలకనున్నారు.