• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పిల్లలకు పౌష్టిక ఆహారం అందించండి: సర్పంచ్

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హమాలీ కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ MPPS పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తనకు తెలియజేయాలని సూచించారు.

February 27, 2026 / 03:39 PM IST

వేసవి నీటి ఎద్దడిపై 11వ డివిజన్‌లో బోర్ల పరిశీలన

WGL: వర్ధన్నపేట రానున్న వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని 11వ డివిజన్ కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని 11వ డివిజన్‌లో చెడిపోయిన నీటి బోర్లను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని, గేట్ వాల్వ్‌లను సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

February 27, 2026 / 03:30 PM IST

సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణం గీతం కాలేజీ రోడ్లోని గాయత్రి బ్యాంక్ ఎటిఎం సెంటర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ప్రారంభించారు. అనంతరం విశ్వశాంతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విద్యార్థులను అభినందించారు. ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.

February 27, 2026 / 03:28 PM IST

రూ. 151కే భద్రాద్రి శ్రీ సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలు

KNR: భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ. 151లకే అందించే పోస్టర్‌ను KNR రీజనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆర్టీసీ KNR RM రాజు ఆవిష్కరించారు. ఉమ్మడి KNR జిల్లాకు చెందినవారు రూ. 151 చెల్లించి మార్చి 31 వరకు తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. KNR: 9154298561, 9154298581, HZB, HSBD: 9154298559, JGTL, MTPY, KRTL: 7780250439, SRCL, VMWD- 915429857కు సంప్రదించాలన్నారు.

February 27, 2026 / 03:26 PM IST

ఇంగ్లీష్ పరీక్షకు 214 మంది హాజరు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 221 మంది విద్యార్థులు నమోదు కాగా, 214 మంది హాజరయ్యారు. 7 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించబడినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 03:25 PM IST

రోడ్డు ప్రమాదం దంపతులకు తీవ్ర గాయాలు

WNP: బుద్ధారం గండి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రేవల్లి మండలంలోని చిరుకపల్లికి చెందిన పోతుల కేశవులు, వనజ దంపతుల బైక్‌‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవులకు తల గాయంతో పాటు కాలు ఫ్రాక్చర్ అవ్వగా, భార్యకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో వారిని మహబూబ్‌ నగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 03:20 PM IST

క్వింటా పత్తి ధర ఎంతంటే.?

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ఈ వారం మొదటిరోజుతో పోలిస్తే ఈరోజు పత్తి ధర కాస్త పెరిగింది. ఈ వారం మొదటిరోజు క్వింటా పత్తి ధర రూ. 7545 ధర పలకగా.. మంగళవారం రూ. 7,510 అయింది. బుధవారం రూ. 7,515 ధర రాగా..గురువారం రూ. 7,550 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ. 7,555 అయిందని అధికారులు తెలిపారు.

February 27, 2026 / 03:19 PM IST

పరీక్షలకు ఎంతమంది గైర్హాజరు అయ్యారంటే.?

ASF: కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 13 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో 200 మందికి గాను 195 మంది హాజరు కాగా, ఐదుగురు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 114 మందికి, 106 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 03:18 PM IST

సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై అవగాహన

KMR: మాచారెడ్డి జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు కళా బృందం వారు విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులు, చట్టాల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

February 27, 2026 / 03:18 PM IST

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

SRPT: అనంతగిరి మండలంలోని మొగ్గులాయకోట గ్రామ శివారులో వెంకట సాయి, కేఎన్ఆర్ గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామరావు సమక్షంలో గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు తమ సానుకూల, వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించారు.

February 27, 2026 / 03:18 PM IST

రేపు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.!

మెదక్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్, సింధుజ మైక్రో క్రెడిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. 18 రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం కనీసం ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 27, 2026 / 03:15 PM IST

ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం

KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ పంచాయితీలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిపించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో AEO వెంకట్, సర్పంచ్ ముద్దం నగేష్, రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 03:09 PM IST

వీధి కుక్కల బెడత తొలగించాలని వినతి

గద్వాల 2, 3 వార్డుల్లో వీధి కుక్కల బీభత్సంపై కాలనీవాసులు శుక్రవారం గద్వాల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి వినతి పత్రం అందజేశారు. వీధుల్లో చిన్నారులు ఆడుకోవాలన్నా, మహిళలు బయటకు వెళ్లాలన్నా ప్రాణ భయంతో వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి నష్టం వాటిల్లిన రైతులకు పరిహారం అందించి, కుక్కల బెడద నుంచి పట్టణాన్ని విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 03:08 PM IST

ఘనంగా శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు

VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధతో ఘనంగా నిర్వహించబడ్డాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, కైంకర్యాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సౌహార్దాన్ని పెంపొందిస్తాయని సూచించారు.

February 27, 2026 / 03:06 PM IST

రోడ్డు పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి

SRPT: నూతనకల్ మండలం నుంచి వెంకేపల్లి వరకు నిలిచిపోయిన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో మంత్రిని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు.

February 27, 2026 / 03:06 PM IST