• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

MIM ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

HYD: MIM ఆధ్వర్యంలో సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దులహ్ బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.

March 3, 2026 / 05:12 AM IST

బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.

March 3, 2026 / 05:00 AM IST

హైకోర్టు తీర్పును అమలు చేయాలి: కోతి మాధవి

HYD: తెలంగాణ ఉద్య మకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి అన్నారు. తెలంగాణ ఉద్య మకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.

March 3, 2026 / 04:19 AM IST

బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం

సిరిసిల్ల జిల్లా 33వ వార్డులోని బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 33వ వార్డు కౌన్సిలర్ కొండ నరేష్ హాజరై మాట్లాడారు. ప్రజలందరూ నిండు పున్నమిలా సుఖసంతోషాలతో ఉండాలని, ఆత్మీయతలను పంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, ఆడెపు శ్రీనివాస్, సాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 11:02 PM IST

MPPS పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

VKB: హుస్సేన్‌పూర్ MPPS పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GHM నరసింహులు, క్రాంతి కుమార్, ఇతర ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ​పిల్లల ప్రతిభను చూసి అతిథులు వారిని ఎంతో అభినందించారు.

March 2, 2026 / 09:48 PM IST

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమ సింగ్★ పైర్ణమి సందర్భం ఏడుపాయలలో ఘనంగా దుర్గమ్మ పల్లకి సేవ★ ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం విద్యార్థులు హాజరు★  రేగోడ్ మండలంలో హీటర్ పేలి ఇల్లు దగ్ధం

March 2, 2026 / 09:44 PM IST

జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

MDK: హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు.

March 2, 2026 / 09:14 PM IST

తిరుమలనాథుని దర్శించుకున్న ఎమ్మార్వో

MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో కిష్ట్యా నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో జగదీశ్వర్, సర్పంచ్ శవకూల స్వాతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:12 PM IST

‘పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి’

BDK: పినపాకలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు తక్షణం కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అనేక ఇళ్లు మంజూరై పూర్తి అయినప్పటికీ, చాలా ఇళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.

March 2, 2026 / 08:59 PM IST

‘నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి’

SDPT: బనేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలంలోని గోనెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.

March 2, 2026 / 08:58 PM IST

‘బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం’

JGL: బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుండి 15 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

March 2, 2026 / 08:57 PM IST

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.5,01,280, VIP దర్శనాలతో రూ.3 లక్షలు, కార్ పార్కింగ్‌తో రూ.2,71,500, బ్రేక్ దర్శనాలతో రూ.1,57,500, ప్రధాన బుకింగ్‌తో రూ.1,00,200, లీజులతో రూ.7 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.27,09,930 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.

March 2, 2026 / 08:56 PM IST

హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

NLG: హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుక సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

March 2, 2026 / 08:52 PM IST

హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

NZB: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ చట్టం సెక్షన్-76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

March 2, 2026 / 08:51 PM IST

కుమ్మరి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

WGL: నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఆకర్షితులై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో ఈ రోజు కుమ్మరి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

March 2, 2026 / 08:48 PM IST