• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్టీసీ డ్రైవర్ మిస్సింగ్.. కేసు నమోదు

SRD: నారాయణఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్‌పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భయంగా ఉంది చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంలో పాపయ్యకు సంబంధించి వస్తువులు, బైక్, సెల్ ఫోన్ గుర్తించి హద్నూర్ పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

February 21, 2026 / 09:44 AM IST

కేటిదొడ్డి రైతులకు రబీ పంట నమోదు సూచన

GDWL: కేటిదొడ్డి గ్రామ రైతులు తమ రబీ సీజన్ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు రిజిస్టర్, పంట వివరాల నమోదు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సాయం పొందేందుకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 21, 2026 / 09:43 AM IST

కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్.. ప్రజలు జాగ్రత్త

VKB: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. 8332957830 నంబర్ నుంచి ఫోన్ చేసి, ఆస్తి పన్ను చెల్లించాలని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎత్తవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 09:43 AM IST

AISF విద్యార్థి సంఘం రాష్ట్ర సమితి సభ్యుడుగా పవన్ చౌహన్

RR: ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర సమితి సభ్యుడుగా రెండవసారి షాద్‌నగర్ పట్టణానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం విద్యార్థి లోకానికి అండగా ఉండి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.

February 21, 2026 / 09:29 AM IST

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి సహాయం

మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు తక్షణ సహాయం అందజేశారు. ఆయన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్మక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదులు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:27 AM IST

అక్రమంగా పశువుల రవాణా.. కేసు నమోదు

BDK: అశ్వాపురం టీడీపీ సెంటర్‌లో శనివారం తెల్లవారుజామున మణుగూరు నుంచి అక్రమంగా మొరంపల్లి బంజరుకు ఓ వాహనములో బంధించి తరలిస్తున్న 12 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్లు స్థానిక సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.

February 21, 2026 / 09:27 AM IST

గురుభక్తి చాటుకున్న మేయర్ మధుకర్

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గురుభక్తి చాటుకున్నారు. నస్పూర్ పరిధి సీతారాంపల్లిలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుడు జాడి శంకరయ్యకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓనమాలు నేర్పడంతో పాటు చిన్ననాటి నుంచి తన ఎదుగుదలకు ఉపాధ్యాయుడు శంకరయ్య పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు.

February 21, 2026 / 09:26 AM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. 25 కేంద్రాల ఏర్పాటు..!

WNP: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 13, ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాలను కలెక్టర్ కార్యాలయం నుంచి తరలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లలో పటిష్ట భద్రత మధ్య భద్రపరుస్తున్నారు.

February 21, 2026 / 09:21 AM IST

కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంపిక

NGKL: రాష్ట్ర పంచాయతీరాజ్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జిల్లా వాసి సుగుణాకర్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 09:20 AM IST

రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

SRCL: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 22న (ఆదివారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి గంభీరాపేట్‌లో బయోస్ట్రాటమ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు భూమిపూజ నిర్వహించి రైతులతో సంభాషిస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.

February 21, 2026 / 09:18 AM IST

ఉమ్మడి జిల్లాలో 7.55 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. 14 కేంద్రాల ద్వారా 33 వేల మంది రైతుల నుంచి రూ.590 కోట్ల విలువైన 7.55 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. గరిష్టంగా క్వింటాకు రూ.8,110 మద్దతు ధర లభించింది. ఇప్పటికే మెజారిటీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, చివరి దశలో అమ్మిన వారికి త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

February 21, 2026 / 09:13 AM IST

శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NGKL: శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో NGKL జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన పంపూరం ఆంజనేయులు (38) గాయపడి, శుక్రవారం వెల్దండ ఆసుపత్రిలో మృతి చెందారు. కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 21, 2026 / 09:12 AM IST

రేపు గురుకుల ప్రవేశ పరీక్ష: DCO

WGL: జిల్లా వ్యాప్తంగా రేపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భక్తి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు DCO అపర్ణ తెలిపారు. విద్యార్థులు నిర్ణిత సమయంలో హాల్ టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు.

February 21, 2026 / 09:09 AM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం

MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్‌కు తరలిస్తుండగా పట్టుకొని స్థానిక స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల వరకు ఉందని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 09:09 AM IST

దామరగిద్ద రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సూచన

NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:07 AM IST