• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళా పోలీసులకు ఉచిత ఆరోగ్య శిబిరం

JGL: జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్పీవీ టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్యులు వివరించారు.

March 1, 2026 / 04:44 PM IST

ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం: సర్పంచ్

MHBD: బయ్యారం మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ షాపును ఆదివారం బయ్యారం SI తిరుపతి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి-కిషన్ నాయక్, జెగ్గు తండా సర్పంచ్ బొల్లి జయంతి-వెంకటకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

March 1, 2026 / 04:42 PM IST

‘విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి’

MDK: నర్సాపూర్ BVRIT కళాశాలలో నిర్వహించిన భగ్గిలా పోటీలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని మహేందర్ సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.

March 1, 2026 / 04:41 PM IST

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్‌కు సన్మానం

శంకర్పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ను ఆయన స్నేహితులు (1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ ) ఈరోజు ఘనంగా సన్మానించారు. తమ స్నేహితుడు మున్సిపల్ చైర్మన్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

March 1, 2026 / 04:39 PM IST

ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్‌లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్‌ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లుక్క గంగాధర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 04:38 PM IST

ఆత్మ కమిటీ రైతుల అభివృద్ధికి కీలకపాత్ర పోషించాలి: సీతక్క

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆత్మ చైర్మన్ కార్ల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కమిటీ సభ్యులకు ప్రమాణం చేయించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ రైతుల అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని, రైతుల సమస్యలపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సహకరించాలని సూచించారు.

March 1, 2026 / 04:35 PM IST

గోపాలపురంలో ఉచిత మంచి నీటి ప్లాంట్ ప్రారంభం

BHNG: తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో మంచినీటి ప్లాంట్ను సర్పంచ్ పుట్ట సాయిలు ప్రారంభించారు. దాత గుర్రాల నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన దాతను ఈ సందర్భంగా అభినందించారు.

March 1, 2026 / 04:34 PM IST

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు: మంత్రి

PDPL: ధర్మారం మండలం నంది మేడారం సోలార్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో  కార్యాలయం మార్కెట్ యార్డ్ మధ్య ఆక్రమిత భూములను స్వాధీనం చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

March 1, 2026 / 04:33 PM IST

ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో భక్తులు రాక

BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 1,99,248 మంది రామయ్య సేవలో తరించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే నెలలో 1,97,860 మంది స్వామివారిని దర్శించుకోగా గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది అని అధికారులు తెలిపారు.

March 1, 2026 / 04:32 PM IST

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవముత్తులను ఆసీనులను చేసి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 1, 2026 / 04:31 PM IST

మునుగోడులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

NLG: మునుగోడులో రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించడం శుభపరిణామమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విద్యకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

March 1, 2026 / 04:31 PM IST

‘వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారించాలి’

WNP: వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జిల్లా సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 04:31 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో దుర్గం లావణ్య, అఖిలేశ్వర్, అన్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపుతప్పి కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షత్తగాత్రులను ఘటనా స్థలానికి చేరుకున్నారు.

March 1, 2026 / 04:30 PM IST

ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

MBNR: హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకం సొంతింటి కల నెరవేర్చుతూ సామాజిక సమానత్వానికి దారి తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమి బాయ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

March 1, 2026 / 04:30 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోను బాధితుడికి అందజేత

BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం SI దివ్య ఆధ్వర్యంలో బాధితుడు సురేష్‌కు మొబైల్ ఫోన్ తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ హరీష్ ఉన్నారు.

March 1, 2026 / 04:29 PM IST