• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా హోలీ వేడుకలు

GDWL: గద్వాలో మంగళవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది విధుల్లోని ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. రంగుల, సంతోషంతో గ్రామీణులు హోలీ ఆనందాన్ని భరించారు.

March 3, 2026 / 12:45 PM IST

అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ,అడవుల పరిరక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.

March 3, 2026 / 12:44 PM IST

పెద్దమ్మ తల్లి ఆలయం మూసివేత

BDK: చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు మంగళవారం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ తలుపులను మూసివేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం తలుపులను సైతం మూసివేశారు. రేపు ఆలయంలో సంప్రోక్షణ కార్య క్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు.

March 3, 2026 / 12:42 PM IST

రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు

MBNR: డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ సూచించారు.

March 3, 2026 / 12:41 PM IST

జిల్లా బీజేపీ అధ్యక్షుడి మాతృమూర్తి మృతి

RR: జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి వనిపల్లి భారతి దేవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ భారతి దేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాహెబ్ నగర్ శ్మశానవాటికలో భారతీ దేవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 3, 2026 / 12:40 PM IST

‘డీటీసీపీ లేని వెంచర్లలో ప్లాట్లు కొనరాదు’

SRD: కంగ్టి మండల పరిధిలో కొంతమంది ఫామ్ ప్లాట్ పేరుతో వెంచర్లను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారని, అలాంటి వాటిని నమ్మి మోసపోకూడదని పంచాయతీ కార్యదర్శి సుభాష్ సూచించారు. డీటీసీపీ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్లు కొనుగోలు చేయరాదని ఆయన హెచ్చరించారు. డీటీసీపీ అనుమతులు లేకుండా పొందాల్సిందేనని తెలిపారు.

March 3, 2026 / 12:36 PM IST

శ్రీ జెండా బాలాజీ మందిరం మూసివేత

నిజామాబాద్ గోల్ హనుమాన్ శ్రీ జెండా బాలాజీ మందిరాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో జీ. వేణు వెల్లడించారు.

March 3, 2026 / 12:35 PM IST

జనగామ పట్టణ అభివృద్ధికి సహకరించాలని వినతి

JN: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జనగామ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రతాపరెడ్డి, పలువురు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలిశారు. జనగామ పట్టణ అభివృద్ధికి సహకరించాలని, జనగామ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. అనంతరం కౌన్సిలర్లను మంత్రి సన్మానించారు.

March 3, 2026 / 12:33 PM IST

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత

NRPT: మక్తల్ పట్టణంలోని ఒక జ్యువెలర్స్ షాప్ నుంచి వివాహ కార్యక్రమం నిమిత్తం ఒక జత బంగారు కమ్మలు, ఒక బంగారు ముక్కుపుడక, ఒక జత వెండి మట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆభరణాలు ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి అందజేశారు.

March 3, 2026 / 12:31 PM IST

రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

NLG: జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

March 3, 2026 / 12:31 PM IST

ఐక్యత, సామరస్యానికి హోలీ ప్రతీక: మంత్రి

MDK: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దామోదర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. హోలీ రంగుల్లా ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకున్నారు. రాష్ట్రం శాంతి, అభివృద్ధి, సౌభాగ్య మార్గంలో మరింత ముందుకు సాగాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 12:31 PM IST

‘అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది’

MNCL: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని ఆయన కోరారు.

March 3, 2026 / 12:31 PM IST

92వ రోజుకు చేరిన ముంపు బాధితుల దీక్ష

NGKL: ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషనను రద్దు చేయాలని, ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలను ముంపు నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 92వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ నిరసనలు ఆపేది లేదని బాధితులు తెగేసి చెప్పారు. ఈ దీక్షలో ఎర్రవల్లి, తండా ప్రజలు పాల్గొన్నారు.

March 3, 2026 / 12:30 PM IST

OPDR పేరుతో భారీ మోసం.. భూదాన్ భూముల విక్రయంపై చర్య

KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ భూములను అక్రమంగా విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. OPDR భూదాన్ కమిటీ పేరుతో అమాయక ప్రజలకు ప్రభుత్వ భూములను పంచుతామని నమ్మించి, ఒక్కొక్కరి నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

March 3, 2026 / 12:29 PM IST

‘భూ దందా చేస్తే కఠిన చర్యలు తప్పవు’

BDK: చుంచుపల్లి ప్రశాంత్‌ నగర్ పంచాయతీ పరిధిలో భవివాదం చిలికి చిలికి గాలివానలా మారి హత్యాయత్నానికి దారితీసింది. హక్కుపత్రాలున్న యజమానిని బెదిరించడమే కాకుండా, పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో టూటౌన్ సీఐ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ దందాలకు పాల్పడితే సహించేది లేదని వారు అన్నారు.

March 3, 2026 / 12:26 PM IST