• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాజీ ఎంపీపీ రాజ్యలక్మ్షి కన్నుమూత

MDK: హవేలీ ఘనపూర్ మండల సర్దన గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ రాజ్యలక్ష్మి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. 1987లో టీడీపీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. తొలి ఎంపీపీగా ఐదేళ్ల పాటు సేవలందించారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలను ఆల్వాల్ మంగాపురం కాలనీలో నిర్వహించనున్నారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

March 7, 2026 / 08:31 AM IST

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

BHNG: యాదగిరిగుట్ట పట్టణం 3వ వార్డులో ఎక్కల పద్మ లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని అన్నారు.

March 7, 2026 / 08:28 AM IST

నేడు పట్టణ కేంద్రంలో విద్యుత్ అదాలత్

WGL: నెక్కొండ పట్టణ కేంద్రంలో ఇవాళ విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్, ఏబీ స్విచ్ సమస్యలు, కొత్త మిడిల్ పోల్స్ ఏర్పాటు, ఐరన్ పోల్స్ మార్పు, ఏబీ కేబుల్ మార్పు వంటి సమస్యలపై దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

March 7, 2026 / 08:27 AM IST

లారీ బీభత్సం.. కార్మికులు, ఆటోడ్రైవర్‌కు గాయాలు

HNK: నగరంలోని భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టి, అదే వేగంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కన్నం రాణి (45) కాలు నుజ్జునుజ్జు అయిపోయింది. ఆటో డ్రైవర్ జనార్దన్ చేతికి, మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 08:27 AM IST

‘సైబర్ క్రైమ్ మోసగాళ్ల ఆట కట్టించాలి’

KNR: దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న సైబర్ క్రైం మోసగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భానుప్రసాదావు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిటమైన నియంత్రణ పద్ధతులు అవలంబించాలని కోరారు. డ్రగ్స్‌ నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.

March 7, 2026 / 08:27 AM IST

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరిపై కేసు

ADB: తాంసి మండలంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. వడ్డాడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఇన్స్టాగ్రామ్‌లో ఇతరులకు షేర్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

March 7, 2026 / 08:27 AM IST

రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై బీట్ ఆఫీసర్

KMM: వన్యప్రాణి సంరక్షణలో విశేష సేవలందిస్తున్న బీట్ ఆఫీసర్ భూక్యా కల్పన రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గౌరవం దక్కింది. కామేపల్లి మండలం జోగ్గూడెంకు చెందిన కల్పన ప్రస్తుతం మల్లారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే లా కోర్స్ చదువుతున్నారు. 2012లో విధుల్లో చేరిన ఆమె, అటవీ సంరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నారు.

March 7, 2026 / 08:24 AM IST

నడిగూడెంలో దట్టమైన పొగమంచు

SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురిసింది. కనీసం 5 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారిపై ప్రయాణం కష్టతరంగా మారడంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి, అత్యంత నెమ్మదిగా ప్రయాణించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

March 7, 2026 / 08:22 AM IST

‘పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి’

KMR: గతంలో గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళీ ఆదేశించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ నిధులను గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే పంచాయతీ సెక్రటరీలు చెల్లించాలని సూచించారు.

March 7, 2026 / 08:20 AM IST

‘కల్వల ప్రాజెక్టు ఆధునీకరణకు సహకరించాలి’

KNR: శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ ఆధునీకరణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంకలో రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ డంప్యార్డును హుజూరాబాద్ నియోజవర్గానికి తరలిస్తారని ప్రచారం జరుగుతోందని, దానికి తాము ఒప్పుకోబోమన్నారు.

March 7, 2026 / 08:16 AM IST

సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

NLG: ములపల్లిలోని సాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన మర్రి రవి  గల్లంతయ్యారు. అతని స్నేహితులు జలాల్, సతీశ్‌తో కలిసి సరదాగా  ఈతకు కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే కొడుతుండగా నీటి ప్రవాహానికి అధికంగా రావడంతో రవి నీటిలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

March 7, 2026 / 08:15 AM IST

ప్రభుత్వ పాఠశాలలో స్టేజ్ నిర్మాణానికి వినతి

VKB: దోమ మండల పరిధిలోని మోత్కూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్టేజ్ నిర్మించాలని కోరుతూ సర్పంచ్ ఆనంద్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు నిన్న వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ప్రతిభను చాటేందుకు పాఠశాల ఆవరణలో వేదిక అవసరమని ఈ సందర్భంగా వివరించారు.

March 7, 2026 / 08:12 AM IST

సివిల్స్‌లో సత్తా చాటిన నగర వాసులు

HYD: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మీ రచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951 ఉత్తమ ర్యాంకులు సాధించారు.

March 7, 2026 / 08:12 AM IST

SMAM పథకంలో రైతు పరికరాల పంపిణీ

NRPT: మరికల్ రైతు వేదికలో SMAM పథకం కింద మంజూరైన పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరికల్ మండలానికి 5, ధన్వాడకు 10 స్ప్రేయర్లు అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీతో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రహమాన్ ఖాన్, నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 08:11 AM IST

VIDEO: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: ఎమ్మెల్యే

MBNR: జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ముడా నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను హైమాస్ట్ విద్యుత్ దీపాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

March 7, 2026 / 08:11 AM IST