• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సూర్యాపేట: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల ఓరియంటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 69 కేంద్రాల్లో 12,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు.

February 21, 2026 / 04:37 PM IST

మున్సిపల్ కార్యాలయ నూతన భవనం పరిశీలన

నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో గల భవనాన్ని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరిభువన్ కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుత కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించాలని నిర్ణయించారు. కొత్త భవనంలో అవసరమైన మరమ్మతులు, మార్పులపై సమీక్షించారు.

February 21, 2026 / 04:35 PM IST

సుంకిడి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ముందుగా గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 04:32 PM IST

నర్సరీలను పరిశీలించిన అధికారులు

MNCL: జన్నారం మండలంలోని ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్, రోటిగూడాలలో ఉన్న ప్రభుత్వ నర్సరీలను సందర్శించి నిర్వాహకులకు సూచన చేశారు. వేసవి నేపథ్యంలో మొక్కలకు నీరు పోసి కాపాడాలని ఆయన సూచించారు. ఆ గ్రామాల శివారులలోని అటవీ ప్రాంతాలలో ఉపాధి పనులను పరిశీలించారు.

February 21, 2026 / 04:32 PM IST

పార్టీని బలపదించడమే లక్ష్యం: TPCC చీఫ్

VKB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ శిబిరం లక్ష్మని TPPC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో శిక్షణ కేంద్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:32 PM IST

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణా

JN: జనగామ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని అన్నారు. బీజేపీ జిల్లా నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:31 PM IST

10 రోజుల శిక్షణా శిబిరంలో ఉమ్మడి DCC అధ్యక్షులు

NZB: వికారాబాద్‌లో నేటి నుంచి పది రోజుల పాటు నిర్వహించే జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ఉమ్మడి NZB జిల్లా నేతలు హాజరయ్యారు. NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, KMR జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీనియర్ నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు.

February 21, 2026 / 04:26 PM IST

కర్ల రాజేశ్ లాకప్ డెత్.. సీఎం మౌనం వీడాలి: మందకృష్ణ

HYD: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేశ్ లాకప్ డెత్ జరిగి నేటికి 95 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఓయూలో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాజేశ్ లాకప్ డెత్‌పై సీఎం మౌనం వీడాలని అన్నారు. PS సీసీ ఫుటేజ్ని పరిశీలించి రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.

February 21, 2026 / 04:25 PM IST

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: డీఈవో

SRD: జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 -9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

February 21, 2026 / 04:19 PM IST

HYDలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ పర్యటన

HYD: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ పాటిల్ ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్‌కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఘన స్వాగతం పలికారు. నగరంలోని వివిధ కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

February 21, 2026 / 04:16 PM IST

ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ

JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమి ప్రదేశం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న బండలను తొలగించి, ప్రహరి గోడ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సర్పంచ్‌తో పాటు, మాజీ ఎంపీటీసీ, మాజీ విండో డైరెక్టర్, కుల సంఘల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:15 PM IST

​నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఇంటర్ ప్రశ్నపత్రాలు

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ​నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 04:15 PM IST

ప్రత్యేక తరగతులకు తప్పకుండా హాజరు కావాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.

February 21, 2026 / 04:14 PM IST

ఉచిత బస్సును ప్రారంభించిన కలెక్టర్

NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:13 PM IST

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ట్రస్టు చేయూత

పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 04:13 PM IST