ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 29వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, సంత్ నిరంకారి మిషన్ వారు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇళ్లలోనే వేరుచేసి అందజేయాలన్నారు.
KMM: ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల నూతన చైర్మన్లు, కౌన్సిలర్లు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన మంత్రి, ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని మరియు పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు.
BDK: కొత్తగూడెం మేదర బస్తీలో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంచార జాతులుగా ఉన్న బంజారాలను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏకతాటిపైకి తెచ్చారని గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి భోగ్ భండారో పూజలు నిర్వహించి నివాళులర్పించారు.
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని, సాంకేతిక లోపాలతోనే కొన్ని, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లులు నిలిచిపోయాయని ఆమె సృష్టం చేశారు.
PDPL: మంథని నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 1,00,09,000 విలువైన 266 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని 43, ముత్తారం 44, రామగిరి 44, కమాన్‌పూర్ 23, పాలకుర్తి 8 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78 మందికి చెక్కులు అందనున్నాయని పేర్కొన్నారు.
SDPT: మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో గోటి తలంబ్రాల కార్యక్రమంపై ఆదివారం గజ్వేల్‌కి చెందిన రామకోటి రామరాజు సమావేశం నిర్వహించారు. శ్రీరామనవనాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అవసరమయ్యే గూటితో వచ్చిన తలంబ్రాలు వాడుతారని రామరాజు తెలిపారు. కోటి తలంబ్రాలు దీక్ష వచ్చే శనివారం భారీ ఎత్తున ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
SRPT: ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు ఇంటర్ ప్రశ్న పత్రాలను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా నడుమన తీసుకువచ్చారు. జూనియర్ కళాశాలలకి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ లోని పలు కాలనీలో సుమారు రూ. 4.5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు MLA KR నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. రోడ్లు-డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 4.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
NZB: నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ఆదివారం జిల్లా BJP ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా BJP అధ్యక్షుడు దినేశ్ కులచారి తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బసవరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బసవేశ్వరుడు చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.
SRD: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
MBNR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ ఎపిసోడ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, యువత ప్రేరణ, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
మేడ్చల్: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 366వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులర్పించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా నాగర్ కర్నూల్లో చాకలి కులస్తులపై అగ్రకుల నేతల దాడి, 2 నెలల పసికందు మృతి దురదృష్టరమని అన్నారు.