»Padi Kaushik Reddys Sensational Comment On Etala Rajender
Padi Kaushik Reddy : ఈటలపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్య.. బాలరాజు చంపించింది అతడే
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్(Surpunch)ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.
Padi Kaushik Reddy : తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రాజకీయాలు(politics) రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఎలాగైన గెలిచి తీరాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతే కాకుండా తమ పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ(BRS party) రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్(Surpunch)ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.
ఈటలను ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. బీజేపీ తలపెట్టిన ధర్నా కు జనాలు లేక పక్క నియోజకవర్గం నుండి జనాలను తీసుకొచ్చిండు అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఉద్యమ కారుడు బాలరాజు ను చంపించిన వ్యక్తి ఈటల అంటూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్(KCR) లేకుంటే ఈరోజు నువెక్కడ ఉండేటోనివి అని ఆయన ప్రశ్నించారు. గుడ్లు(Eggs) ఎరుకొనే వ్యక్తి ని తీసుకొచ్చి మంత్రిని చేసిండు కేసీఆర్ అని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది పెడితే ఏ అధికారినైనా నీలాదీస్తా అని ఆయన అన్నారు. జై భీమ్ అంటాడు దళితుల భూములు లాక్కుంటాడని పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై విమర్శలు చేశారు.