అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు.