»Modi Hatao Desh Bachao Brs Party Protest On Singareni Coal Mines Auction
మోదీ హఠావో.. సింగరేణి బచావో BRS Party మహాధర్నా Photos
కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్, సిసిసి కార్నర్ వద్ద శనివారం మహా ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, నడిపెల్లి దివాకర్ రావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో మోదీ పర్యటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మోదీ హఠావో దేశ్ బచావో.. సింగరేణి బచావో అని నినదించారు.