బీజేపీ ఎంపీ అరవింద్ కు…. నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై కవిత సీరియస్ అయ్యారు. చెప్పుతో కొడతానంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఎంపీ అరవింద్ బురద లాంటి వాడని, ఇప్పటి వరకు ఏం చేసినా పట్టించుకోలేదన్నారు. తన గురించి మరోసారి వ్యక్తిగతంగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిన మాట నిజమేనని కవిత స్పష్టం చేసారు. షండే తరహా మోడల్ అమలు చేసేందుకు బీజేపీ అనుబంధ సంఘాల నేతలు సంప్రదించారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించానని వెల్లడించారు. అరవింద్ ఫేక్ సర్టిఫికెట్ల పై పిర్యాదు చేస్తానన్నారు. అరవింద్ ను మెత్తగా తంతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతానని స్పష్టం చేసారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడినట్లు ఆరోపణలు చేస్తున్నారని, తాను మాట్లాడలేదని చెప్పారు. బీజేపీ అనుబంధ సంఘాల నుంచి తనకు ఆ పార్టీలో చేరాలని ప్రతిపాదన వస్తే.. తాను ప్రజల్ని, నాయకుల్ని మోసం చేయబోమని నేను చెప్పానని వివరించారు.
తన రాజకీయ జీవితంతో కేసీఆర్ తోనే కొనసాగుతుందని స్పష్టం చేసారు. తాము ఈడీకి భయపడేది లేదని, జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. తమ శక్తితోనే నాయకులవుతాం కానీ, బ్యాక్‌డోర్ నుంచి కాదని చెప్పారు. వాళ్ల ప్రతిపాదనను మర్యాదపూర్వకంగానే తిరస్కరించానని వివరించారు. ప్రజల్లోనే ఉంటామని..అన్నింటినీ ఎదుర్కొంటామని కవిత పేర్కొన్నారు.