»Minister Talasanis Sensational Comments There Is A Conspiracy Behind The Tspsc Paper Leak
Paper leak : మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. TSPSC పేపర్ లీక్ వెనుక కుట్ర ఉంది
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు.ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం ఎదురుదాడికి దిగారు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి యువత దూరం అవుతుందన్న ఉద్దేశంతోనే.. పేపర్ లీక్ (Paper leak) జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి తలసాని. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పరీక్షను రద్దు చేసింది.
ఏఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని TSPSC తెలిపింది. టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ప్రధాన నిందితుడు. ప్రవీణ్ తో పాటు తొమ్మిది మందిని ఈ కేసులో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ గతేడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష(Group 1 Prelims Exam) కూడా రాశాడు. పరీక్షలో 103 మార్కులు వచ్చినా ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదు. (TSPSC అధికారులు ప్రవీణ్ జవాబుపత్రాన్ని పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్ లో రాంగ్ బబ్లింగ్ చేసినట్లు బయటపడింది. దీని వల్లే ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదని తేలింది.
అయితే, ప్రిలిమ్స్ లో అన్ని మార్కులు సాధించేంత ప్రతిభ ప్రవీణ్ కు ఉందా.. ఆ పేపర్ కూడా లీక్ చేశాడా? అనే సందేహంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కారణంగానే.. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer) ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షపత్రం లీక్ చేసిన కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణ్ మరిన్ని అక్రమాలకు పాల్పడి ఉంటాడనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పరీక్ష పత్రం పేపర్ లీక్ (Paper leak) వ్యవహారంలో ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఫోన్ ను పరిశీలించగా.. అందులో చాలామంది మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్ వివరాలు బయటపడ్డాయి.