»There Will Be A Conspiracy To Kill Ka Pauls Sensational Comments
KA Paul : హత్యకు కుట్ర జరుగుతుంది.. కేఏ పాల్ సంచలనం కామెంట్స్
ఢీల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy case) నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని సైతం విడుదల చేయాలన్నారు.

ఈడీ అంటే కోర్టు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc kavitha) కోర్టునే ఇంటికి రమ్మంటోందని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్ గాంధీ (Rahul Gandhi) లాంటీ వారు ఈడీ (ED) ఎదుట విచారణకు హాజరైన కేఏ పాల్ సంగతి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కళ్లు నెత్తిమీదకు వచ్చాయని ఈ తొమ్మిదేళ్లలో కోదండరామ్, మందకృష్ణ మాదిగతో (Mandakrishna Madiga)పాటు మరెందరో ఉద్యమకారులను సీఎం ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కోర్టులకు లాగుతున్నానని తన సోదరుడి హత్య కేసులో తనను అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని పాల్ సంచలన కామెంట్స్ చేశారు