కేంద్రంలోని ప్రధాని మోదీ (PM MODI) ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి విమర్శలు చేశారు. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్న(Adani Group)కు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ (GST) విధించకపోవడంపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ట్విటర్(Twitter)లో ఆ న్యూస్ క్లిప్పింగ్‌ను యాడ్ చేస్తూ ఒక పోస్టు పెట్టారు.దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు (Airports) పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని మంత్రి కేటీఆర్ ట్విటర్లో తెలిపారు. ‘ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యంగ్యంగా రాశారు. కేంద్రం ప్రభుత్వం(Central Govt) చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, ఎ మిత్ర్ కాలమని (దోస్తుల కాలమని) మంత్రి విమర్శించారు.