»Governor Tamilisais Key Decision On Pending Bills
Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా..తాను బిల్లులను పరిశీలిస్తున్నామని గవర్నర్ చెప్పుకొస్తున్నారు.
పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లలను ప్రభుత్వానికి తిరిగి పంపి ఝలక్ ఇచ్చారు. డీఎంఈ (DME) పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. అంతేగాక, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, ప్రయివేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్ భవన్ (Raj Bhavan) మధ్య గత కొంత కాలంగా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెుత్తం 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం (State Govt) గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదం కోసం పంపగా.. ఆమె వాటిని చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి (Shanti Kumari) సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే, 2022 సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టి.. ఉదయ సభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోద ముద్ర వేసి, మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. దీంతో సర్కార్, గవర్నర్ మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తమిళి సైపై బీఆర్ఎస్ (BRS) నేతలు విమర్శలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల్లో మూడింటికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేశారు. మరో రెండింటిని అధ్యయనం చేసిన గవర్నర్.. వాటిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు. మరో రెండు బిల్లులను ఆమోదం తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. మిగిలిన బిల్లులను గవర్నర్ తమిళి సై తన వద్దే ఉంచుకున్నారు.