»Manchu Lakshmi Emotional Post On New Couple Manoj Maunika
Manchu Lakshmi : నూతన జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
మంచు మనోజ్(Manchu Manoj) , భూమా మౌనిక రెడ్డిలు వివాహం (marriage)చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi) అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది.
మంచు మనోజ్(Manchu Manoj) , భూమా మౌనిక రెడ్డిలు వివాహం (marriage) చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi) అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది. ఇక తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. ఈ ఫొటో వివాహనికి ముందు బయటకు రాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అదే ఫొటోను షేర్ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. అంతేకాదు ‘ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు’ అంటూ మనోజ్ ఎమోషనల్ (Emotional)అయ్యాడు.
ఇదిలా ఉంటే విడాకుల (Divorce) అనంతరం ఒంటరి వాడు అయిన మనోజ్ మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. పెళ్లి అనంతరం మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకుని ఏడ్చిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు’ అంటూ రెండు హార్ట్ ఎమోజీలను జత చేసింది. వీరి పెళ్లికి మోహన్ బాబు (Mohan Babu) అభ్యంతరం చెప్పగా.. మొదటి నుంచి మంచు లక్ష్మి వీరికి మద్దతుగా ఉందని ఈ పెళ్లితో తెలిసిపోయింది.అయితే ఎప్పటి నుంచో మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మనోజ్-మౌనికలు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరు వేరువేరుగా లైఫ్‌ను స్టార్ట్ చేశారు. ఇక ఇద్దరి జీవితాల్లో పెళ్లి పెటాకులు కావడంతో.. వీరు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని(New life) ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న మనోజ్-మౌనికలు (Manoj-Maunikal) మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి కర్నూలు బయలుదేరిన సంగతి తెలిసిందే.