»Fake Videos Of Attack On Northern Laborers In Tamil Nadu Go Viral
Fake video : తమిళనాడులో ఉత్తరాది కూలీలపై దాడి ఫేక్ వీడియోలు వైరల్
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉత్తరాది వారిపై దాడులు జరిగాయంటూ ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు (Orders) జారీ చేశారు. ఉత్తరాది కూలీలపై తమిళులు దాడులకు దిగుతున్నారంటూ విషప్రచారానికి దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫేక్ వీడియోలు (Fake videos) నమ్మి ఎవరూ భయాందోళలనలకు లోను కావద్దని స్టాలిన్ సూచించారు. సీఎం ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఉత్తరాది కూలీలు (labours) ఎక్కువగా ఉండే కోయంబత్తూర్,(Coimbatore) తిరుప్పూర్ జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారితో అధికారులు సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ (Help line) కూడా ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరాది కూలీలపై దాడి ఘటనలో నిజానిజాలు వెలికి తీసేందుకు బీహార్ (Bihar) అధికారులు తమిళనాడుకు చేరుకున్నారు. ఆదివారం వారు కోయంబత్తూర్, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.