»Kotha Manohar Reddy Suspended To The Congress Party
Revanth టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు.. కొత్త మనోహర్ రెడ్డి సస్పెండ్
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Kotha Manohar Reddy Suspended To The Congress Party
Kotha Manohar Reddy: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన కొత్త మనోహర్ రెడ్డిని (Kotha Manohar Reddy) కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. టికెట్ల కోసం రేవంత్ డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అవీ వైరల్ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో కామెంట్స్ చేసిన మనోహర్ రెడ్డిపై టీ పీసీసీ చర్యలకు ఉపక్రమించింది. మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రకటించారు.
బీఆర్ఎస్ టు కాంగ్రెస్
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కొత్త మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మహేశ్వరం నియోజవకర్గ బాధ్యతలు చూసుకుంటారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగెస్ పార్టీలో చేరారు. చేరి నెళ్లాళ్లు అవుతుందో లేదు.. స్పస్పెన్షన్కు గురయ్యారు. మరీ దీనిపై పొంగులేటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలీ. తనతో వచ్చేవారికి టికెట్ ఇప్పిస్తానని.. మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇప్పుడు అందుల్లోంచి ఓ నేతను సస్పెండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి
మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి…
సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో సహా బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి…
ఏం జరిగిందంటే..?
ఇటీవల కొత్త మనోహర్ రెడ్డికి సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి రూ.10 కోట్ల నగదు, 5 ఎకరాల భూమి తీసుకున్నారని ఆరపించారు. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. భూమి, నగదు ఇచ్చింది బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు కూడా చెప్పానని వివరించారు. మనోహర్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. సొంత పార్టీ నేత.. టికెట్లపై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే స్పందించింది. వెంటనే మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్
రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నేతను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి ప్రకటించారు.