»Komaram Bheem Asifabad District Washes Bathrooms In Tribal Hostels Agitated Students
Students Protest: బాత్రూమ్లు కడిగిస్తున్నారని విద్యార్థుల ఆందోళన
చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినుల చేత చాకిరీ చేయిస్తున్నారు. గిరిజన బాలికల సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్ చేత బాత్రూమ్లు కడిగిస్తున్నారు. హాస్టల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. దోమలు, ఈగలతో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు రొడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
Komaram Bheem Asifabad district washes bathrooms in tribal hostels. Agitated students
Agitate: గిరిజన సంక్షేమ హాస్టళ్ల(Tribal Welfare Hostels)లో విద్యార్థినులచే బాత్రూంలు కడిగిస్తున్న ప్రిన్సిపాల్(Principal)ను తొలగించాలంటూ విద్యార్థులు ఆసిఫాబాద్( Asifabad ), ఉట్నూర్లో ఆందోళనలకు దిగారు. కొమురం భీం ఆసిఫాబాద్(Komaram Bheem Asifabad) జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్లో ప్రిన్సిపాల్ అరాచకాలపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన చోట చాకిరీ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు అంబేడ్కర్ చౌక్ లో రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టారు. తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిల హాస్టళ్లో కనీస వసతులు లేవని పురుగుల అన్నం పెడుతున్నారని స్టూడెంట్స్ అన్నారు.
ఇదే విషయాన్ని నిలదీస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. బుక్స్ వచ్చినా స్టూడెంట్స్కు అందివ్వడం లేదని, పాఠశాల వాతావరణం బాలేదన్నారు. దోమలు, ఈగల కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. హాస్టల్ వాచ్మన్ సైతం తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే విధంగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఉట్నూర్(Utnoor) కేబీ కాంప్లెక్స్ గిరిజన సంక్షేమ ఇంటర్ బాలికలు కూడా రోడ్డెక్కారు. వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కళాశాల బాత్రూంలకు తలుపులు లేవని, పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో వివరించారు. ఈ సమస్యలపై ఐటీడీఏ పీఓకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని వాపోయారు. వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐటీడీఏ ఎదుట ధర్నాకు దిగుతామని విద్యార్థినులు హెచ్చరించారు.