»Kishan Reddy Said Central Disaster Fund With The Telangana Is Rs 900 Crore
Kishan Reddy: రాష్ట్రం వద్ద కేంద్ర విపత్తు నిధులు రూ.900 కోట్లు ఉన్నయ్
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
తెలంగాణ(telangana)లో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (SDRF)ని ఉపయోగించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ శాఖ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి(Kishan Reddy) ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖాతాలో 900 కోట్లు ఎస్డిఆర్ఎఫ్ నిధులు(funds) ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇందులో కేంద్రం వాటా 75 శాతం ఉండగా, రాష్ట్ర వాటా 25 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు వినియోగించాలని కిషన్రెడ్డి కోరారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరదలతో తీవ్రంగా నష్టపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా(bhupalpally district) మోరంచపల్లి(moranchapally) గ్రామాన్ని కేంద్ర మంత్రి సందర్శించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరదల్లో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసిన తర్వాత కేంద్రం సహాయ, సహాయక చర్యల కోసం పలు చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వరంగల్ పట్టణంలో పర్యటించి ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. సరస్సు తెగిపోవడంతో ముంపునకు గురైన కాలనీలను కూడా ఆయన సందర్శించారు.
📍Moranchapalli village, Warangal, Telangana.
Visited various rain-affected areas.
Interacted with residents and took ground updates. Assured the compensation of ₹4 lakh to the families who have missed their family members in the floods. Ordered the officials to expedite the… pic.twitter.com/B1jFM6UGGJ