ప్రధాని నరేంద్ర ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు సాయంత్రం జహీరాబాద్‌కు చేరుకుంటారు. మోడీ వస్తున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.
PMModi: భారత ప్రధాని నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం హెలికాప్టర్లో జహీరాబాద్‌కు చేరుకుంటారు. ప్రత్యేక వాహనాల్లో జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి వెళ్తారు. సాయంత్రం 5.20 వరకు ప్రజాసభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడితో తెలంగాణ పర్యటన ముగుస్తుంది. ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. ముందుగా ప్రధాని షెడ్యూల్ మే 3, 4వ తేదీల్లో ఉంటుందని అందరూ భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ తేదీలు పర్యటన రద్దు అయింది. తరువాత మే 8, 9 తేదీల్లో మళ్లీ రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపారు. వేములవాడలో జరిగే బహిరంగ సభకు మోడీ మే 8న హాజరుకానున్నారు.
అలాగే మే1న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. ఈ రోడ్ షో మొత్తం లాల్‌దర్వాజా నుంచి శాలిబండ వరకు కొనసాగనుంది. అలాగే మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.