»Patanjali Cancellation Of License To Manufacture Divya Pharmacy Products
Patanjali: దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి మరో షాక్ తగిలింది. ఆ సంస్థకు చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు అయ్యింది. దీనిని ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Patanjali: Cancellation of license to manufacture Divya Pharmacy products
Patanjali: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి మరో షాక్ తగిలింది. ఆ సంస్థకు చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు అయ్యింది. దీనిని ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకుంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్‌ను పతంజలి ఉల్లంఘించినట్లు అథారిటీ తెలిపింది. ప్రచారం చేసిన ప్రయోజనాలపై ఆధారాలను సమర్పించడంలో విఫలమైనట్లు తెలిపింది.
పతంజలి ఆయుర్వేద దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వద్దని హెచ్చరించింది. అయితే ఇకపై ఇలాంటి ప్రకటనలు చేయమని న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. అయిన మళ్లీ వాటిని ఉల్లంఘించడంతో కోర్టు మండిపడి.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.