హైదారాబాద్లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ (Telangana) హైకోర్టు కీలక ఉత్తర్వులు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్(Hussain Sagar)లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ధర్మాసనం (Tribunal) పేర్కొంది.
పీఓపీ(POP)తో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని పిటిషన్(Petition)లో కోరారు. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్లో కోరారు. గతేడాది కోర్టు (Court) ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు (High Court) హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.