»Kcr Chandrababu Are Welcomed To The Swear Of Revanth Reddy As A Cm
Revanth ప్రమాణ స్వీకారం.. కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానం
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టనున్న క్రమంలో ప్రముఖులకు టీ పీసీసీ ఆహ్వానాలు పంపించింది. మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పలువురిని ఇన్వైట్ చేసింది.
KCR, Chandrababu Are Welcomed To The Swear Of Revanth Reddy As A CM
Revanth Reddy: మరికొన్ని గంటల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిజీగా ఉన్నారు. హైకమాండ్ పెద్దలను కలుస్తూ.. ప్రమాణ స్వీకారానికి రావాలని కోరుతున్నారు.
కాసేపటి క్రితం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ను తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని, అందుకు సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. ఇటు ప్రమాణ స్వీకారం కోసం ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది.
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలు, ఇతర నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, రాజకీయ పార్టీ నేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానం పంపించింది. ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఇన్వైట్ చేసింది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులకు ఆహ్వానాలు పంపించారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గెహ్లట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, ఆర్సీ కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే, మాణికం ఠాగూర్, కురియన్లను ఆహ్వానించింది.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్య, వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. సినీ ప్రముఖులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపించింది.