Arvindపై కవిత విసుర్లు.. వ్యక్తిగత విమర్శలు వద్దంటూ వార్నింగ్
ధర్మపురి అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలను మీ ఇంట్లో వారిపై చేస్తే భరించగలరా అని తెలంగాణ ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్ర పాలకులపై ఇలాంటి భాష ఉపయోగించలేదని చెప్పారు.
Kavitha: ఇందూరు ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఫైరయ్యారు. ఇటీవల అర్వింద్ చేసిన కామెంట్స్ సరికాదని విమర్శించారు. ఇప్పుడిప్పుడే మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారని.. అర్వింద్ చేష్టల వల్ల వారు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉందన్నారు. తాను జగిత్యాలకు బతుకమ్మ ఆడేందుకు వచ్చానని పేర్కొన్నారు. అక్కడ మహిళలు కొందరు అర్వింద్ అన్న మాటలను తనతో చెప్పారని వివరించారు.
‘నువ్వు చస్తే రూ.20 లక్షలు.. మీ అన్న చస్తే రూ.10 లక్షలు ఇస్తా. మీ నాన్న ఇట్ల.. ఇలా మాట్లాడటం సరికాదు. వ్యక్తిగత విషయాలు కాకుండా.. పొలిటికల్‌గా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఇష్యూ బేస్డ్గా ఏదీ అడిగిన సమాధానం చెప్పేందుకు సిద్ధం అన్నారు. అర్వింద్ భాష ప్రయోగం మీ ఇంట్లో ఎవరినైనా అంటే ఏం చేస్తారు. భరించగలరా.. అని తెలంగాణ సమాజాన్ని అడిగారు. అర్వింద్ భాష గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర పాలకులను కూడా మాట్లాడలేదు’ అని కవిత (Kavitha) పేర్కొన్నారు.
గెలిచిన, ఓడిన తాను హుందాగా ఉన్నానని కవిత (Kavitha) స్పష్టంచేశారు. కేసీఆర్ బిడ్డ కావడంతో ఇలా మాట్లాడటం సరికాదన్నారు. నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి ఓడిపోయినప్పటికీ తాను హుందాగా వ్యవహరించానని స్పష్టంచేశారు. అర్వింద్ చేసే విమర్శలను తెలంగాణ ప్రజలు, సమాజం గమనించాలని కోరారు. ఇలాంటి వారు ఉండటం వల్ల మహిళలు బయటకు రావడం లేదు.. కొందరు జాబ్ చేసే ధైర్యం చేయడం లేదు. ఇక రాజకీయాల్లోకి అసలే రావడం లేదని గుర్తుచేశారు.