తెలంగాణలో(Telangana) అధికారంలోకి రావడం కోసం బీజేపీ (BJP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ (PM MODI) , అమిత్ షాలాంటి వారు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొనడం, ప్రసంగాలు చేయడమే ఇందుకు నిదర్మనం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) దిగి నేరుగా సంగారెడ్డికి రానున్నారు
తెలంగాణలో(Telangana) అధికారంలోకి రావడం కోసం బీజేపీ (BJP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ (PM MODI) , అమిత్ షాలాంటి వారు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొనడం, ప్రసంగాలు చేయడమే ఇందుకు నిదర్మనం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) దిగి నేరుగా సంగారెడ్డికి రానున్నారు. తెలంగాణలో 5 పార్టీ కార్యాలయాలను నడ్డా ప్రారంభించనున్నారు. అలాగే ఏపీలో కూడా రెండు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అయితే మొదటగా సంగారెడ్డికి (Sangareddy) చేరుకుని అక్కడ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ఆ తర్వాత మిగతా ఆరు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ (Virtual)గా ప్రారంభించనున్నారు.అనంతరం కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. మరోవైపు నడ్డా పర్యాటన కోసం బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీనడ్డా పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ బీజేపీ (Telangana BJP) ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీయనున్నారు జేపీ నడ్డా. వచ్చే ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపై తెలంగాణ (Telangana) కాషాయనాథులకు దిశానిర్దేశం చేయనున్నారు.. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు.