Bandi Sanjay : కేసీఆర్, కేటీఆర్ పై బండి సంజయ్ ట్విట్టర్ లో విమర్శలు..!
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కెసిఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా... తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే హైయెస్ట్ సాలరీ అందుకుంటున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ఆయనకు నెలకు నాలుగు లక్షల పదివేల రూపాయలు జీతంగా వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కెసిఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా… తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే హైయెస్ట్ సాలరీ అందుకుంటున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ఆయనకు నెలకు నాలుగు లక్షల పదివేల రూపాయలు జీతంగా వస్తుందని పేర్కొన్నారు.
ఇక ఆయన కుమారుడు కేటీఆర్ ఇమేజ్ 100 కోట్లు అని ఆయన కామెంట్ చేశారు. ఇటీవల బండి సంజయ్, రేవంత్ రెడ్డి తన మీద అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దానిని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ఈ మేరకు ట్వీట్లు చేశారు.
మరో పక్క కెసిఆర్ కుమార్తె కవిత 20 లక్షల వాచి ధరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరి అత్యాచారం, ర్యాగింగ్, కుక్కల చేత చంపబడిన పిల్లలు, TSPSC పేపర్ లీకేజీ బాధితుల విలువ ఎంత? అని ఆయన ట్వీట్ చేశారు. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా #SaaluDoraSelavuDora అంటూ ఆయన కామెంట్ చేశారు.