Jogu Ramanna : ఇది సంకల్ప సభ కాదు.. ఎన్నికల ప్రచార సభ
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్రం పరిధిలోని సమస్యలపై తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు.
Jogu Ramanna : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్రం పరిధిలోని సమస్యలపై తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. మోడీ పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆయన ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఈమేరకు స్థానిక పా ర్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఆ లేఖను విడుదల చేశారు. సిసిఐ పరిశ్రమతో పాటు.. అదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, విమానాశ్రయ ఏర్పాటు తో పాటు టెక్స్టైల్ పార్క్ నిర్మాణంపై ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ప్రజానీకానికి మరోసారి నిరాశ నిస్పృహలకు గురి చేశారన్నారు.
ఇది ముమ్మాటికి సంకల్ప సభ కాదు. ప్రజలను నిరాశపర్చిన సభగా ఆయన అభివర్ణించారు. గతంలో పలుమార్లు సీసీఐ పునరుద్ధరణ విషయాన్ని కేంద్రం దృష్టికి తీ సుకువచ్చినా ఫలితం లేదన్నారు. గతంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి సీసీఐను సందర్శించిత్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదన్నా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఇచ్చి న ప్రకటనను గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఈ సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. అదిలాబాద్ జిల్లా పై మోడీకి కనీస కనికరం లేకపోవడమే ఈ సభ నిదర్శనమన్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ ముమ్మాటికి ఎన్నికల ప్రచారమే ఇది అని జోగు రామన్న అన్నారు.