వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (High Court) రేపటికి వాయిదా వేసింది. వైఎస్ వివేకా హత్య విషయం సీఎం జగన్(CM JAGAN) కు ముందే తెలుసని సీబీఐ (CBI) పేర్కొనడంపై సీఎం తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై న్యాయపర చర్యలకు సిద్దం అవుతున్నారు. కాగా వివేకా మృతి జగన్‌కి ఉదయం 06:15 కు ముందే తెలిసిట్లు తెలిసిందని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది . హత్య విషయం ఎంవీ కృష్ణారెడ్డి (MV Krishna Reddy) బయటపెట్టక ముందే హత్య విషయం జగన్‌కు తెలుసని అనుబంధ కౌంటర్లో సీబీఐ పేర్కొంది .
జగన్‌కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది . సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వెకేషన్ బెంచ్‌లో ఇరుపక్షాల మధ్య వాదనలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, సీబీఐ(CBI) తరుఫున న్యాయవాదులు ఎవరికి వారే తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసే సమయానికి వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy), సునీతారెడ్డిల వాదనలు విన్న కోర్టు సీబీఐ వాదనలు శనివారం వింటామని విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సీబీఐ సమర్పించిన అనుబంధ కౌంటర్( CBI Petition)లో కీలక విషయాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది .