»Investor Business Summit In Hyderabad On April 16th 2023
Business Summit: ఏప్రిల్ 16న హైదరాబాద్లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్
భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.
హైదరాబాద్(hyderabad) మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. నిమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని తాజా పోకడలు, పెట్టుబడులు, వ్యూహాలు, అవకాశాలపై చర్చించడానికి వివిధ పరిశ్రమలకు చెందిన పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, వ్యాపారస్థులు హాజరుకానున్నారు.
అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెట్టుబడిదారులు ఇతర ఇన్వెస్టర్లతో కూడా కనెక్ట్ అవ్వవచ్చు. దీంతోపాటు ఫైనాన్స్(finance) ప్రపంచంలో విలువైన సలహాలు సూచనలతోపాటు అవకాశాలని కూడా పొందవచ్చని నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని, బ్రహ్మాజీ, రోహిణి మొదలైన తెలుగు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరూ పాల్గొనవలసిందిగా నిమిషా బిజినెస్ క్లబ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కెవిఎస్ఎన్ మూర్తి అభ్యర్థించారు. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని కీలక మైన వ్యాపార వేత్తల(businessman) నుంచి కీలక ప్రసంగాలు, ఉత్తేజకరమైన నెట్వర్కింగ్ సెషన్లు, తాజా పెట్టుబడి పోకడల గురించి తెలుసుకోవడానికి అనేక అవకాశాలను అందిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.