తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రూ.500కే గ్యాస్ సిలిండర్ రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. మహిళా మండలాలకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ (Gas cylinder) ఇవ్వడంతో పాటుగా ఫ్రీగా రేషన్ బియ్యం(Free ration of rice), సరుకులు కూడా ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు.ఆదిలాబాద్ పిప్పిరి నుండి జడ్చర్ల వరకు 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించాను. పీపుల్స్ మార్చ్ (People’s March) రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో ఏర్పాటు చేసింది కాదు. ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడితే కష్టాలు పెడుతున్నారు.
కర్ణాటక (Karnataka) ప్రజలు బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని బతికించారు. మీరు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ఇంటి నుండి ఖాళీ చేయిస్తే కర్ణాటక ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు మీ కోసం మేము మీ వెంటే ఉంటాం. 5 నెలల్లో కాంగ్రెస్ ఫ్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ భూములు మీకు పంచుతాం. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఇంటి సరుకులు ఇస్తామని భట్టి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh), ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, అనిరుద్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.