ఖమ్మం(Khammam)లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజున ప్రారంభించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై హైకోర్టు (High Court ) అనుమతి నిరాకరించింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం (NTR statue)పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం 14 పిటిషన్స్ దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ JAc, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం వంటి సంస్థలు పిటిషన్లు వేశాయి. ఇందు కోసం దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని రెడీ చేయించారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులివ్వాలని యాదవ సంఘాలు (Yadava communities)పిటిషన్ దాఖలు చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించాయి.
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ (AG) వాదనలు వినిపిస్తూ.. విగ్రహంలో పిల్లన గ్రోవి, పింఛం తొలగించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, నిర్వాహకులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. మంత్రి పువ్వాడ (Minister Puvvada) అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని, హిందూ యాదవ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సినీ నటి కరాటే కళ్యాణి (Actress Karate Kalyani) కూడా ఈ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఖమ్మం(Khammam) నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ ఆందోళన కూడా నిర్వహించారు..