»If Not A Mistake Why You Feared About Ed Notice Kishan Reddy Asked
kavitha ఏ తప్పు చేయకుంటే ఎందుకు భయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు.
if not a mistake why you feared about ed notice kishan reddy asked
kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థల విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పారు.
కవితకు (kavitha) ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని అడిగారు. తాము చేసిన అవినీతిని తెలంగాణ సమాజంతో ముడిపెట్టాలని చూడటం సరికాదన్నారు. ప్రజలను (people) రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం ఒక్కటేనా అని అడిగారు. అంత నీతిమంతులైతే ఈడీ కేసు (ed case) విషయంలో ఎందుకు గగ్గోలు పెడుతున్నారని అడిగారు. తప్పు చేయకుంటే నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అంతే తప్ప రాద్దాంతం చేయడంతో ఉపయోగం లేదన్నారు.
ఢిల్లీ వెళ్లి మద్యం వ్యాపారం చేసింది ఎవరు.. మొబైల్స్ ధ్వంసం చేసింది ఎవరు అని అడిగారు. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు. రేపు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.