Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Airport) చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్ను (cm kcr) కలిసేందుకు ప్రగతి భవన్ (pragathi bhavan) వస్తారని వార్తలు వచ్చాయి. నేరుగా ఎయిర్ పోర్టుకు పయనం అయ్యారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. రాత్రి 8 గంటలకు హస్తిన చేరుకుంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతారు. ఈడీ నోటీసుపై కవిత (kavitha) లేఖ కూడా రాశారు. 10వ తేదీన మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఉందని అందులో పేర్కొన్నారు. తనకు గడువు ఇవ్వాలని కోరినా.. ఈడీ (ed) ససేమిరా అందని తెలిసింది. దీంతో ఆమె ఈ రోజు ఢిల్లీ బయల్దేరారు. లిక్కర్ స్కామ్లో కవిత (kavitha) అరెస్ట్ అవుతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. మిగతా పక్షాల మద్దతు కూడగడుతుంది.
ఢిల్లీ వెళ్లేముందు కవిత (kavitha) ప్రగతి భవన్ వచ్చి సీఎం కేసీఆర్ను (cm kcr) కలువాల్సి ఉంది. ప్రగతి భవన్ రాకుండానే బయల్దేరారు. అంతకుముందే కేసీఆర్ (kcr) ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారట. న్యాయపరంగా పోరడాతామని చెప్పారని తెలిసింది. పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని సమాచారం. అందుకే కవిత నేరుగా ఢిల్లీకి పయనం అయ్యారు. గత కొద్దీరోజుల నుంచి కవిత అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతుంది. కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.
ఇప్పటికే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్.. షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటీవల మాజీమంత్రి సిసోడియా కూడా అరెస్టయ్యాడు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు అందజేశారని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.