kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ఇదీ సీఎం కేసీఆర్ (cm kcr) పతనానికి ఆరంభం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (rd officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. అందుకోసమే.. ఒకవేళ అరెస్టై.. జైలుకు వెళ్లినా.. తిరిగి వచ్చి జనాల్లోకి వచ్చి చెబుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కవిత చెప్పారట.
కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu) అరెస్ట్.. షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటీవల మాజీమంత్రి మనీశ్ సిసోడియా (manish sisodia) కూడా అరెస్టయ్యాడు. ఆ తర్వాత కవిత (kavitha) అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత (kavitha) ఆమ్ ఆద్మీ పార్టీకి (aam admi party) రూ.150 కోట్లు అందజేశారని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.