మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆషాఢమాసం అంటే బోనాలు, హైదరాబాద్ వాసులకు బోనాలు అంటే ఒక ఎమోషన్. చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఇంట్లో బంధు మిత్రులతో ఆషాడం బోనాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్ షాపులను, కళ్ళు దుకాణాలను బంద్ చేయాలనీ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కీలక పురాతన విడుదల చేశారు.
గత వారం జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు జరిగాయి, ఈవారం లాల్ దర్వాజా సింహవాహినీ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. అందుకుగాను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, బోనాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూలై 28 ఉదయం 6 గంటలు నుంచి రెండు రోజులపాటు సిటీలో అన్ని వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.
జూలై 29 సోమవారం రోజున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది
చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో మాత్రం జూలై 28 ఉదయం 6 నుంచి జూలై 29 ఉదయం 6 వరుకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో రెండు రోజులపాటు మూసివేయనున్నారు. బోనాలు చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఒక్కరు తమ మిత్రులకు దావత్ ఇస్తుంటారు. దావత్ లో నాన్ వెజ్, చుక్క ఉండాల్సిందే. పొలిసు ప్రకటన విన్న మందుబాబులు ముందుగానే జాగ్రత్త పడటంతో వైన్ షాప్స్ వద్ద కోలాహల వాతావరణం ఏర్పడింది