హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా, నగరంలో పర్యవేక్షణ, సురక్షిత వాతావరణం కల్పించేందుకు, హైదరాబాద్ పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. సిటీ పరిమితులలో ఉన్న అన్ని వైన్ షాపులు, సెప్టెంబర్ 17 వ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18 వ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడతాయి అని ప్రకటించింది .
ఈ నిర్ణయం, గణేశ్ నిమజ్జన సమయంలో సందడి, పెద్ద సమూహాలు మరియు ఉత్సవ వాతావరణం సృష్టించడంతో, అసభ్య ప్రవర్తన లేదా అనవసర ఘర్షణల్ని నివారించేందుకు తీసుకున్నది. వైన్ షాపుల మూసివేత, నిమజ్జన సమయంలో ప్రజల మధ్య ఉండవలసిన అనవసర ఒత్తిడిని తగ్గించడానికి, మరియు రోడ్డు భద్రతను పెంచడానికి సహాయపదాటాయని పోలీసులు పేర్కొన్నారు.
రేపు ఉదయం 6 గంటల నుండి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. ఖైరతాబాద్ గంశుని నిమజ్జనం పైనే అందరి దృష్టి ఉంది. బడా గణేశుని నిమజ్జనం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. బాలాపూర్ గణేశుని వేలంపాట 8 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు బాలాపూర్ గణేశుని నిమజ్ఞ్మ పూర్తవుతుంది. సిటీ లో గణేష్ నిమజ్జనం 18వ తేదీ సాయంత్రం వరుకు జరుగుతుంది.