తెలంగాణ రాష్ట్రంలోని వినాయక చవితి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మండపం బాలాపూర్ గణేశుడు. బలాపూర్ , ప్రతి సంవత్సరం నిర్వహించే గణేష్ ఉత్సవానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం, బలాపూర్ లడ్డూ వేలం, ప్రతీ ఏడాది గతం కంటే ఊహించని ధర పలుకుతుంది ఈ లడ్డు.
1994లో ప్రారంభమైన ఈ వైవిధ్యమైన వేలం, ఆ సమయంలో రూ.450తో ప్రారంభమైంది. కానీ, 2023లో, దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను రూ.27 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం, లడ్డూ ధర రికార్డ్ స్థాయికి చేరుకుంటుందనే అంచనా ఉంది, కొందరు ఇది రూ.40 లక్షల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ధర అంతగా పెరగడానికి కారణం, పాల్గొనే లబ్దిదారుల సంఖ్య పెరగడం మరియు వారు ఎలాగైనా లడ్డు కొనాలనే సంకల్పం అంటున్నారు
బలాపూర్ లడ్డూ ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. భక్తులు, ఈ లడ్డూ పొందడం ద్వారా గణేష్ వారి సమస్యలను పరిష్కరిస్తారని, విశ్వాసం, ఆశీర్వాదం అందిస్తారని, మంచి ఆరోగ్యం మరియు ఆర్థిక బలం కలిగిస్తారని నమ్ముతారు.
ఈ సంవత్సరం, లడ్డూ వేలం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వేలం పూర్తైన తర్వాత, బలాపూర్ గణేష్ ప్రదర్శన ప్రారంభమవుతుంది. హైదరాబాద్ పోలీసుల సమాచారం ప్రకారం, బాలాపూర్ గణేశుని నిమజ్జనం సాయంత్రం 4 గంటల సమయంలో ముగియాల్సి ఉంది.