మొబైల్ ప్రియులకు ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024- 25 ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవితాల్లో, ప్రతి వ్యక్తికి శరీరంలో ఒక భాగం అయిపోయిన ఫోన్ ధరల్లో కూడా మార్పు వస్తుంది. మొబైల్ కంపెనీల్లో రారాజు అయిన ‘ఆపిల్’ ఇండియన్ యూజర్స్ కు తీపి కబురు చెప్పింది
బడ్జెట్ లో ప్రకటించిన విధంగా మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ చార్జీలను 20 శతం నుండి 15 శాతానికి తగ్గించింది. ఈ మార్పులకు అనుగుణంగా ఆపిల్ తన వినియోదారులపై పడే భారాన్ని కొంత తగ్గించింది, ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శతం తగ్గించింది. iPhone Pro, iPhone Pro Max ధరలను 5100, 6000 రూపాయిలు తగ్గించింది ఆపిల్. ప్రో మోడల్ ఫోన్ ధరలను ఆపిల్ తగ్గించడం ఇదే మొదటి సారి.
ఆపిల్ సాధారణంగా కొత్త మోడల్స్ మార్కెట్లో విడుదల చేసాక పాత మోడల్ ధరలను తగ్గిస్తుంది. ఇండియాకు ఇంపోర్ట్ చేసుకునే మొబైల్ ఫోన్లకు 18 శాతం GST, 22 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటాయి. కొత్త బడ్జెట్ ద్వారా వచ్చిన మార్పుల వల్ల కస్టమ్స్ డ్యూటీ 16.5 శాతం మాత్రమే పడుతుంది. ఆపిల్ కంపెనీ ప్రస్తుతం ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ను మాత్రమే విదేశాల నుండి దిగుమతి చేస్తుంది, మిగతా మోడల్స్ అన్ని భారత్ లోనే తయారుచేస్తుంది.