TSRTC : టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి : హైకోర్టు
గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు TSRTCను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని కోరింది.
TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కొత్త కొత్త పథకాలతో ప్రజలకు మరింత చేరువ అవుతోంది. సంస్థ ఆదాయం పెంచుకునేందుకు గ్రామాల్లో బస్ ఆఫీసర్ల(Bus Officers)ను నియమించాలని ఇటీవలే టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వేల గ్రామాల(Village)కు బస్సు సౌకర్యం ఉండగా.. రెండువేలకుపైగా గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు సంస్థను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు కోర్టు నోటీసులు(Notice) జారీ చేసింది.
ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి(Rajireddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్(petition)పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.కె.జయప్రకాశ్‌రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రిటర్నింగ్ అధికారిని నియమించినా ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తూ వస్తున్నారని కోర్టుకు తెలిపారు. నిజానికి రెండేళ్లకోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. గత పాలకవర్గం గడువు ముగిసినా కార్మికశాఖ 2018 నుంచి ఎన్నికలు నిర్వహించడంలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది(Lawyer) కోర్టుకు తెలిపారు. ఆర్టీసీలో 48 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, తమ యూనియన్ పలు ఎన్నికల్లో గెలిచి గుర్తింపు సాధించిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 24కు వాయిదా వేసింది. దీంతో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు(High court) ఎన్నికలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.