»Harry Josh As The Most Wanted Villain Reentry On Telugu Screen
Harry Josh : మోస్ట్ వాంటెడ్ విలన్‌గా హ్యారి జోష్..తెలుగు తెరపై రీఎంట్రీ
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా హ్యారీ జోష్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మంచులక్ష్మీ ఆదిపర్వం సినిమాలోనూ నటిస్తున్నారు.
బాలీవుడ్ (Bollywood)లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా వెలుగొందుతున్న ‘హ్యారి జోష్'(Harry Josh) తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. వాంటెడ్, వెల్కమ్, ధూమ్2, గోల్ మాల్3 , టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో హ్యాపీ మెరిశారు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన బద్రినాథ్ చిత్రంలో మెయిన్ విలన్‌గా చేశారు. తాజాగా ఆయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie)లో కనిపించనున్నాడు.
మంచు లక్ష్మీ నటిస్తున్న ఆదిపర్వం సినిమా(Adiparvam Movie)లో కూడా నెగటివ్ రోల్లో కనిపిస్తున్నాడు. హిందీ, తెలుగులోనే కాకుండా పంజాబీ, కన్నడ, మరాఠీ వంటి భాషల్లోనూ నటిస్తున్నారు. బహు భాషా నటుడిగా హాలీవుడ్(Hollywood) ఇండస్ట్రీలో హ్యారీ జోష్(Harry Josh) సత్తా చాటుతున్నాడు. ఇవే కాకుండా ఇప్పటి వరకూ సుమారుగా 100 యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించాడు. తను తాజాగా నటిస్తున్న గేమ్ చేంజర్, ఆదిపర్వం సినిమాలు తనకు తెలుగులో మంచి గుర్తింపు తెస్తాయని హ్యారీ జోష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఉద్యోగ రీత్యా హ్యారీ జోష్(Harry Josh) కెనడాలో ఉండేవాడు. అక్కడ హృతిక్ రోషన్ సినిమా లొకేషన్స్ కోసం సాయం చేశాడు. అదే అతనికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. హృతిక్, రాకేష్ రోషన్ల ప్రోత్సాహంతో అమితాబ్ బచ్చన్‌తో కలిసి యాడ్ ఫిల్మ్ చేశారు. బాలీవుడ్ బడా హీరోల ప్రేమాభిమానం పొంది తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాడు. హ్యారీ జోష్ పట్టుదల, అంకిత భావానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.