ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి మరిన్ని సినిమాలు(Movies) రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓటీటీ(OTTs)ల్లోనూ వినోదాత్మక సినిమాలు సందడి చేయనున్నాయి. తాజాగా విరూపాక్ష సినిమా(Virupaksha Movie) విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ వేసవిలో సందడి చేయడానికి మరికొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా ఏజెంట్(Agent Movie). అక్కినేని అఖిల్(Ahkil) హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ఏజెంట్. ఇదొక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ మూవీ ఏప్రిల్ 28వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది.
చోళుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా పొన్నియన్ సెల్వన్(Ponnoyan selvan). ఈ మూవీ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. గతంలో పొన్నియన్ సెల్వన్ 1 సినిమా(Ponniyan selvan 1) విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు పార్ట్ 2 విడుదల కానుంది. ఈ మూవీ కూడా ఏప్రిల్ 28వ తేదిన విడుదల కానుంది. నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రారా..పెనిమిటి'(Ra ra Penimiti). ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ. సింగిల్ క్యారెక్టర్‌తో ఈ మూవీ రూపొందింది. ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
శిసు(Shisu) అనే చిత్రానికి జల్మరీ హెలెండర్ దర్శకత్వం వహించారు. ఇదొక హిస్టరికల్ మూవీ. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లతో పాటుగా ఓటీటీ(Otts)ల్లోనూ పలు సినిమాలు విడుదల కానున్నాయి.
నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 27న దసరా మూవీ(Dasara Movie), కోర్ట్ లేడీ హిందీ వెబ్ సిరీస్, ది గుడ్ బ్యాడ్ మదర్ వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 26న నో వోల్యాండ్ వెబ్ సిరీస్, ఏప్రిల్ 28న బిఫోర్ లైప్ ఆఫ్టర్ డెత్, ఎకా వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో సిటాడెల్ ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది. అలాగే పత్తు తల అనే తమిళ్ మూవీ ఏప్రిల్ 27న స్ట్రీమింగ్ కానుంది. జీ5లో 28న వ్యవస్థ, హిందీ చిత్రం యూటర్న్ స్ట్రీమింగ్ కానున్నాయి.