»Good News For Women Interest Free Loans On March 8
womens day Gift : మహిళలకు గుడ్ న్యూస్… మార్చి8న వడ్డీ లేని రుణాలు
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు (Harish rao) గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి8న సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలను సంబందించి రూ 750 కోట్లు విడువదల చేస్తామని చెప్పారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని హారిశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు (Harish rao) గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి8న సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలను సంబందించి రూ 750 కోట్లు విడువదల చేస్తామని చెప్పారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని హారిశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి (Sangareddy) పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేదల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నారన్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం (womens day) సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం తీసుకురాబోతున్నామన్నారు. ఆరోగ్య మహిళా (Health woman) కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా పరీక్షలు , మందులు ఇవ్వబోతున్నామన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అందరూ మహిళలు(womens) వినియోగించుకోవాలన్నారు. సెర్ప్, వీవోఏ ఉద్యోగులకు వేతన సవరణ చేసి జీతాలు పెరిగి వస్తాయన్నారు. ప్రభుత్వపరంగా మూడు ఐవీఎఫ్ (IVF) ఇంఫటాలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దీవించాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్ ఐఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.