NLG: ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకే అప్పజెప్పి ఆర్టీసీని బలోపేతం చేయాలని సీఐటీయూ, ఆర్టీసీ కార్మిక నాయకులు, డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ దొడ్డి కొమురయ్య భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి బస్ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.