NGKL: కోడేర్ మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్ పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో PHD సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి, నెట్ అర్హతతో 2021లో పీహెచ్డీ అడ్మిషన్ పొందారు. డా. నూర్జహాన్ పర్యవేక్షణలో నానోపార్టికల్స్‌పై పరిశోధన చేశారు. ప్రస్తుతం నర్సాపూర్‌లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.